Telugu Updates
Logo
Natyam ad

వాట్సాప్ లో కొత్తగా పోల్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే?

ఆంజనేయులు న్యూస్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఇతర యాప్లకు దీటుగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు యాప్లో మార్పులు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ గ్రూప్ చాట్లలో పోల్స్ ఫీచర్ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) స్క్రీన్ షాట్స్ను కూడా విడుదల చేసింది. మరి ఏంటీ వాట్సాప్ పోల్స్? ఎలా పనిచేస్తుంది? తెలుసుకుందాం.. రండి..

గ్రూప్ పోల్స్ ఫీచర్..
మెసేజింగ్ యాప్లు టెలిగ్రామ్, ఫేస్బుక్ మెసేంజర్లో ఉన్నట్లుగానే గ్రూప్ పోల్స్ ఫీచర్ను తీసుకురావాలని వాట్సాప్ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉందని.. త్వరలోనే వాట్సాప్ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని వాబీటా ఇన్ఫో పేర్కొంది. అయితే, వాట్సాప్ గ్రూప్ పోల్ను క్రియేట్ చేయడానికి ముందు ఒక ప్రశ్నను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత, యూజర్లు ఓటు వేయడానికి కొన్ని సమాధానాలను జోడించాలి. గ్రూప్ లో ఉన్న మెంబర్స్ మాత్రమే పోల్స్, వాటి ఫలితాలు చూడగలుగుతారు. మెంబర్లు సెలక్ట్ చేసిన ఆప్షన్ను బట్టి పోల్ రిజల్ట్స్ వెలువడతాయి. కాగా, గ్రూప్ అడ్మిన్లు పోల్ ఆప్షన్లను సవరించగలరా? లేదా? పోలింగ్ కు టైం లిమిట్ ఉంటుందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.