Telugu Updates
Logo
Natyam ad

విఆర్ఎల రిలే నిరాహారదీక్షలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల కలెక్టరేట్ సమీపంలో విఆర్ఎలు చేస్తున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందిస్తున్న విఆర్ఎ లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం శోచనీయమని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం విఆర్ఎల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

వీఆర్వో మాదిరిగా వీఆర్టీ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విఆర్ఎల డిమాండ్లను పరిష్కరిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.