Telugu Updates
Logo
Natyam ad

రేపు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా విడుదల..!

తిరుమల: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ప్రత్యేక దర్శన కోటాను గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు. ఆన్లైన్ లో టోకెన్లు బుక్ చేసుకున్న భక్తులను ప్రస్తుతం రోజూ ఉదయం 10గంటల స్లాట్ దర్శనానికి అనుమతిస్తున్నారు. జూన్ 1 నుంచి మధ్యాహ్నం 3 గంటల స్లాట్ లో అనుమతిస్తారు. ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటా గురువారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల కానుంది..