
మంచిర్యాల జిల్లా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ అగ్నిపథ్ వల్ల భారత ఆర్మీ వ్యవస్థ బలహీన పడుతుందన్నారు. 16 ఏళ్ళు పనిచేసే ఆర్మీలో నాలుగేళ్ల విధానం సరికాదన్నారు. వెంటనే అగ్నిపర్ ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు..

