Monday, August 17, 2026
HomeTelanganaకోణార్క్ ఎక్స్ ప్రెస్ లో పొగలు.?

కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో పొగలు.?

📰 Generate e-Paper Clip

డోర్నకల్: ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. కోణార్క్ ఎక్స్ప్రెస్ లోని ఏసీ బోగీలో పొగలు రావడంతో రైలును డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్ కు చేరుకొని మరమ్మతు చర్యలు చేపట్టారు. పొగలు వ్యాపించిన బోగీని వేరు చేసి ప్రయాణికులను మరో బోగీలోకి తరలించారు. ఈ ఘటన వల్ల ప్రయాణికులెవరూ ఇబ్బంది పడలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఏసీ బోగీలో పొగలు రావడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.