Friday, July 3, 2026
HomeTelanganaశివ బాలాజీ మ్యాన్ పవర్ ఏజెన్సీని" రద్దు చేయాలి.?

శివ బాలాజీ మ్యాన్ పవర్ ఏజెన్సీని” రద్దు చేయాలి.?

📰 Generate e-Paper Clip

జిల్లా దళిత అభివృద్ధి అధికారి కి వినతి పత్రం అందజేస్తున్న: సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత

అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న “శివ బాలాజీ మ్యాన్ పవర్ ఏజెన్సీని”

బ్లాక్ లిస్ట్ లో పెట్టి, పూర్తిగా రద్దు చేయాలి.

డబ్బులు ఇవ్వాలని వర్కర్లను వేధిస్తున్న “శివ బాలాజీ మ్యాన్ పవర్ ఏజెన్సీని” రద్దు చేయాలి.

సిఐటియు ఆధ్వర్యంలో SC DD జిల్లా కార్యాలయం ముందు నిరసన

Post Midle

మంచిర్యాల జిల్లా: సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో పనిచేసే పార్ట్ టైం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని  సోమవారం  రోజున ఎస్సీ జిల్లా దళిత అభివృద్ధి అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ ఎస్సీ కళాశాల హాస్టల్ లో గతంలో బ్లెస్ వెల్ఫేర్ అవుట్సోర్సింగ్ సొసైటీ ద్వారా  వాచ్మెన్, కుక్, కామటి, స్వీపర్లు గా  పని చేస్తున్నారు. ఆ ప్రస్తుతం వీళ్ళకి వేతనాలు ఇవ్వాలని కొత్త టెండర్లు శివ బాలాజీ మ్యాన్ పవర్ ఏజెన్సీ కి వచ్చింది.ఈ ఏజెన్సీ వ్యక్తులు వర్కర్ల దగ్గరికి వెళ్లి ఒక్కొక్కరి నుండి లక్ష రూపాయల నుంచి 50 వేల రూపాయలకు ఇవ్వాలని లేకపోతే  మీమ్మల్ని పనిలో నుండి తొలగించి వేరే కొత్త వాళ్ళని తీసుకుంటామని బెదిరిస్తున్నారు.

• అటవీ శాఖ పరిధిలో పని చేస్తున్న వర్కర్స్ కి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు సదరు అ ఏజెన్సీ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని  పై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలుస్తుంది.

• మేనేజింగ్ డైరెక్టర్ పొనగంటి హరీష్ అనే వ్యక్తి  2017 వ సంవత్సరంలో  ఉద్యోగాలు పెట్టిస్తారని నిరుద్యోగులు దగ్గర నుండి డబ్బులు వసూలు చేసాడు. మోసపోయిన నిరుద్యోగులు స్థానిక కన్నాల బస్తి బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

• మేనేజింగ్ డైరెక్టర్ పొనగంటి హరీష్  గుప్తనిధుల తవ్వకం విషయంలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

• గతంలో ఈ ఏజెన్సీ వివిధ శాఖలల్లో ఉద్యోగాలు పెట్టిస్తానని నకిలీ నియామక పత్రాలు సృష్టించి నిరుద్యోగులు మోసం చేశాడు.

అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటూ ,  మమ్మల్ని డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న శివ బాలాజీ మ్యాన్ పవర్ ఏజెన్సీ పై చర్యలు తీసుకొని,ప్రభుత్వం మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా  గౌరవ అధ్యక్షురాలు కల్పలత, జిల్లా ఉపాధ్యక్షురాలు సుకన్య, ప్రేమలత, జిల్లా సహాయ కార్యదర్శి గోమాస లక్ష్మి,ప్రసాద్, సలహాదారులు శ్యామల, అంజలి, భాగ్యలక్ష్మి, లావణ్య,సంధ్యారాణి,స్వరూప, పద్మ,ప్రసన్న, వినీత్ తదితరులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.