Telugu Updates
Logo
Natyam ad

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల బహిరంగ వేలం..!

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా: పోలీసుల ఆధీనంలో ఉన్న ఎవరు గుర్తు పట్టని, ఎవరికి సంబంధించినవో తెలియని, దొరికిన వాహనాలు (అన్నోన్ ప్రాపర్టీ కింద) జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో (108) ద్విచక్ర వాహనాలు, (5) ఆటోలు, (3) నాలుగు చక్రాల వాహనాలు మొత్తం 116 వాహనాలపై చట్టపరమైన విధానాలను అనుసరించి కేసు నమోదు చేయడం జరిగిందని, గత ఆరు నెలల నుండి పై వాహనాల గురించి ఎవరూ రానందున అన్నోన్ స్క్రాప్ ప్రాపర్టీ గా పరిగణించి వేలం వేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ 3న శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏ ఆర్ హెడ్ కోటర్స్ ఆదిలాబాద్ నందు వేలం వేయబడును అని ఎస్పీ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోన్ (unclaimed / abandoned vehicles) వివిధ రకములైన స్క్రాప్ మోటార్ సైకిల్ 108, ఆటోలు 5, నాలుగు చక్రాల వాహనాలు 3, మొత్తం 116 వాహనాలపై 102 సీఆర్పీసీ కేసులు నమోదు చేసి పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు సంబంధిత వాహన యజమానులు ఎవరైనా ఉంటే వాహన డాక్యుమెంట్లు చూపించుకుని వాహనాలను తీసుకుని వెళ్లాలని సూచించారు.

గత 6 నెలల నుండి ఎవరు రానందున అన్నోన్ ప్రాపర్టీ గా పరిగణించి ఏఅర్ హెడ్ కోటర్స్ నందు ఉంచడం జరిగింది. ఆరు నెలల కాల వ్యవధి 30-05-2022 తో ముగుస్తున్నందున జిల్లా పరిధిలోని 116 వివిధ రకాలైన వాహనాలను, జిల్లా ఎస్పీ ద్వారా నియమించబడిన బహిరంగ వేలానికి సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలో జూన్ 3న ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు బహిరంగ వేలం పాట నిర్వహిస్తారు. ఆసక్తి కలవారు వేలంపాటలో పాల్గొని వేలంపాట ద్వారా వాహనాలను స్వాధీనం చేసుకోవచ్చని తెలిపారు. బహిరంగ వేలం లో పాల్గొనే సభ్యులు వేలంపాట రోజున 50, 000 నగదును ఖచ్చితంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నగదు డిపాజిట్ చేసిన వారు మాత్రమే వేలంపాటలో అర్హులుగా పరిగణించబడతారు అని అన్నారు. కార్యక్రమం పూర్తి అయిన తరువాత వేలం పాటలో పాల్గొన్న సభ్యులకు సంబంధించిన డబ్బులు వేలానికి మినహాయించి తిరిగి చెల్లిస్తామన్నారు. పాల్గొనని సభ్యుల డబ్బులు వేలంపాట పూర్తి అయిన వెంటనే తిరిగి చెల్లించబడతాయి.

బహిరంగ వేలం పాటలో పాల్గొనే వారు తమ వెంట వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డులు (కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆమోదించబడినది) వారి వెంట తీసుకొని రాగలరు. ఎటువంటి సందేహాల కైనా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎంటిఓ బి శ్రీపాల్ 9440900676 సంప్రదించాలని కోరా