Wednesday, August 19, 2026
HomeTelanganaనాసిరకం ఎరువులు అమ్మితే కఠిన చర్యలు..?

నాసిరకం ఎరువులు అమ్మితే కఠిన చర్యలు..?

📰 Generate e-Paper Clip

ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నఖిలి విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు దేశానికి వెన్నెముక అని నకిలీ విత్తనాలు సరఫరా, నాసిరకం ఎరువులు కొనుగోలు మరియు విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ పక్కా సమాచారంతో ఎవరైనా నకిలీ విత్తనాల సరఫరా, విక్రయాలు జరిపితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లాలో రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలను సరఫరా చేసిన, నాసిరకం ఎరువులను, కాలం చెల్లిన ఎరువులు, విత్తనాలు విక్రయించిన, సరఫరా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. అలాగే రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేశామని తెలిపారు. నకిలీ విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను ముందుగా గుర్తించడం అడ్డుకోవడం కట్టడి చేయడం, వారు ఎక్కడి నుండి సరఫరా చేస్తున్నారు ప్రైమరీ కాంటాక్ట్, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.

ప్రతి గ్రామంలో పోలీసు అధికారులు వ్యవసాయ రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా తక్కువ ధరకు పత్తి విత్తనాలు కానీ ఇంకా ఏమైనా విత్తనాలు కానీ ఇస్తామని మాయమాటలు చెప్పి విక్రయించడానికి వచ్చిన వారి వివరాలను పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. నకిలీ విత్తనాల పట్ల ప్రతి ఒక్క రైతు అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో నకిలీ విత్తనాల గురించి ఎటువంటి ముందస్తు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఫర్టిలైజర్ షాప్ ల పైన ఆకస్మికంగా దాడులు చేసి ప్రతి షాప్ ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి షాపుల యజమానులకు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఎవరైనా అమ్మితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.