Telugu Updates
Logo
Natyam ad

మే 11 నుంచి ఆ యాప్ లపై నిషేధం..!

ఆంజనేయులు న్యూస్: ఈరోజుల్లో ఏ ఫోన్ లో చూసినా కాల్ రికార్డింగ్ సదుపాయం ఉంది. అయితే ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ యూజర్ల ప్రైవసీకి తీవ్ర భంగం కలిగించడం వల్ల గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకే ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై పనిచేసే థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్ లను గూగుల్ నిషేధిస్తోంది. ఈ నిషేధం మే 11వ తేది నుంచి అమలు కానుందని ప్రకటించింది. ఇకపై ఆయా కాల్ రికార్డింగ్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించవు. ఇకపై యాప్ డెవలపర్లు ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి కాల్ రికార్డింగ్ ఏపీఐ యాక్సెస్ పొందడం కుదరదని గూగుల్ తేల్చి చెప్పింది.

శాంసంగ్, వివో, రెడ్ మీ తదితర కంపెనీల ఫోన్లలో కాల్ రికార్డింగ్ యాప్ లు ఇన్ బిల్ట్ గా రావడంతో ఈ ఫోన్లకు సంబంధించి గూగుల్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.