కామారెడ్డి: కామారెడ్డిలోని ఓ లాడ్జిలో తల్లీకుమారుడు ఆత్మాహుతి ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాదగిరి సహా మొత్తం ఆరుగురిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించే ముందు పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా జిల్లా వైద్య కేంద్రానికి తరలించారు. తొలుత కరోనా పరీక్షలు నిర్వహించి, ఇతర ఆరోగ్య పరీక్షలు చేశారు. వీరందరినీ బుధవారం మధ్యాహ్నం సమయానికి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు..