Telugu Updates
Logo
Natyam ad

ఆ హైస్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి..!

మిమ్స్ హైస్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల నిరసన

మంచిర్యాల జిల్లా: స్కూల్ ఫీజ్ కట్టలేదని విద్యార్థిని పరీక్షకు అనుమతించకపోవడమే కాకుండా నిలదీసిన తండ్రిపై కరస్పాండెంట్ చేయిచేసుకున్న ఘటన శనివారం మంచిర్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. జిల్లా కేంద్రంలోని మిమ్స్ హైస్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న సహస్ర అనే విద్యార్థినిని ఫీజు కట్టలేదని యాజమాన్యం పరీక్షకు అనుమతించకుండా ఇంటికి పంపించారు. ఈ విషయమై పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసిన విద్యార్థి తండ్రి వేల్పుల లక్షన్ పై కరస్పాండెంట్ శ్రీనివాస్ చేయి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆక్కడికి చేరుకొని నిరసన చేపట్టాయి. ఫీజుల పేరిట విద్యార్థులను వేధింపులకు గురిచేయడమే కాకుండా విద్యార్థిని తండ్రిపై పాఠశాల యాజమాన్యం చేయి చేసుకోవడం అమానుషమని వారు ఆరోపించారు. వెంటనే పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా తనపై చేయి చేసుకున్న పాఠశాల కరస్పాండెంట్ పై విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచా