Telugu Updates
Logo
Natyam ad

భారీ భూకంపం… ఇద్దరి మృతి, 90మందికి గాయాలు

తూర్పు జపాన్: లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ భూకంపం వల్ల డజన్ ల కొద్దీమంది గాయపడ్డారు. ఈ భూకంపం వల్ల జపాన్ సునామీ హెచ్చరిక జారీ చేసింది.7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత జపాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈశాన్య జపాన్ లొనీ కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 30 సెంటీమీటర్ల వరకు నీటి మట్టాలు నమోదయ్యాయి. ఈశాన్య జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్ వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని జారీ చేసిన సునామీ హెచ్చరికను కేంద్రం గురువారం తెల్లవారుజామున ఎత్తివేసింది..