Telugu Updates
Logo
Natyam ad

మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి ప్రారంభం..!

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలోని సాయికుంటలో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, ఎమ్మెల్యే ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో పట్టణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గా గాజుల ముకేష్ గౌడ్, కమీషనర్ బాలకృష్ణ, వార్డు కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు..