Telugu Updates
Logo
Natyam ad

వేసవిలో చెరుకు రసంతో ఎన్నో ప్రయోజనాలు.?

ఆంజనేయులు న్యూస్: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట బయటకు వస్తే చాలు గొంతు తడి ఆరిపోతోంది. ఫలితంగా ఎక్కడైనా కూల్ డ్రింక్లు, కొబ్బరి బోండాలు కనిపించగానే ఆగాలనిపిస్తుంది. ఇక తీయటి చెరుకు రసం చూస్తే ఎవరైనా ఇష్టంగా తాగేస్తున్నారు. ఈ చెరుకు రసం వల్ల వేసవిలో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. చెరుకులోని సుక్రోజ్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. చెరుకులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు కాలేయాన్ని వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. నోటి దుర్వాసనను దూరం చేయడంలో చెరుకు రసం అద్భుతంగా పని చేస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లను తగ్గించడానికి దోహదపడుతుంది. చెరుకులో ఉండే ఫైబర్, పొటాషియం కడుపును శుభ్రంగా ఉంచుతాయి. ఇలా బహుళ ప్రయోజనాలున్న చెరుకు రసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతున్నారు.