Tuesday, October 27, 2026
HomeTelanganaమంచిర్యాల నడిబొడ్డున రూ.100 కోట్ల భూమి కబ్జా యత్నం.. పట్టించుకునేదెవరు?

మంచిర్యాల నడిబొడ్డున రూ.100 కోట్ల భూమి కబ్జా యత్నం.. పట్టించుకునేదెవరు?

📰 Generate e-Paper Clip

సర్వే నంబర్‌ 87లో ప్రహరీ నిర్మాణంపై వివాదం.. అడ్డుకోవాలని ఎంఐఎం డిమాండ్‌

మంచిర్యాల, అక్టోబర్‌ 26 ( ఆంజనేయులు న్యూస్‌ )

మంచిర్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న సర్వే నంబర్‌ 87లోని సుమారు ఒక ఎకరం భూమి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ భూమి విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని పేర్కొంటూ, ప్రభుత్వ భూమిని పరిరక్షించడంలో అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఎంఐఎం నాయకులు ప్రశ్నించారు. వివాదాస్పద స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకుని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి ఎంఐఎం మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు మహమ్మద్‌ షాకీర్‌ అహ్మద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ఇబ్ని అఫాన్‌ వినతిపత్రం సమర్పించారు. ఈ భూమికి సంబంధించి హైకోర్టులో A.S. No. 234 of 2023 కేసు పెండింగ్‌లో ఉందని తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ప్రతివాది నంబర్‌ 1 థర్డ్‌ పార్టీ హక్కులు సృష్టించరాదని, వివాదాస్పద భూమి భౌతిక స్వరూపాన్ని మార్చరాదని ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రహరీ నిర్మాణ ప్రయత్నాలపై విచారణ జరిపి, కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇదే ప్రాంతంలో 2026 జూన్‌ 24న జీవనోపాధి కోసం చిన్నచిన్న దుకాణాలు నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారని ఎంఐఎం నాయకులు గుర్తుచేశారు. సుమారు 30 ఏళ్లుగా ఆ దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల ఉపాధి దెబ్బతిందని తెలిపారు. దాదాపు 200 మంది పోలీసుల సమక్షంలో దుకాణాల తొలగింపు జరిగిందని పేర్కొంటూ, పేద చిరు వ్యాపారులపై చర్యలు తీసుకున్న అధికారులు, కోట్ల రూపాయల విలువైన వివాదాస్పద భూమి విషయంలోనూ చట్టప్రకారం వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. సర్వే నంబర్‌ 87 భూమి వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్‌ నాయకులు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఎంఐఎం నాయకులు కోరారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ అధికార యంత్రాంగం బాధ్యత అని, ఈ విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివాదాస్పద భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించి, ప్రహరీ గోడ నిర్మాణ ప్రయత్నాలపై సమగ్ర విచారణ జరపాలని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అమలు చేస్తూ భూమికి రక్షణ కల్పించాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. పేదల దుకాణాల తొలగింపులో చూపిన చట్టబద్ధమైన నిబద్ధతను ప్రభుత్వ భూముల పరిరక్షణలోనూ చూపాలని, అధికారులు తక్షణమే స్పందించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.