మంచిర్యాల నడిబొడ్డున రూ.100 కోట్ల భూమి కబ్జా యత్నం.. పట్టించుకునేదెవరు?

సర్వే నంబర్‌ 87లో ప్రహరీ నిర్మాణంపై వివాదం.. అడ్డుకోవాలని ఎంఐఎం డిమాండ్‌ మంచిర్యాల, అక్టోబర్‌ 26 ( ఆంజనేయులు న్యూస్‌ ) మంచిర్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న సర్వే నంబర్‌ 87లోని సుమారు ఒక ఎకరం భూమి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ భూమి విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని పేర్కొంటూ, ప్రభుత్వ భూమిని పరిరక్షించడంలో అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఎంఐఎం నాయకులు ప్రశ్నించారు. వివాదాస్పద స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకుని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు....