Tuesday, October 20, 2026
HomeTelanganaనిర్మల్ఆడబిడ్డ పుడితే రూ.50 వేలు.. ముగ్గురు పుడితే రూ.2.25 లక్షలు!

ఆడబిడ్డ పుడితే రూ.50 వేలు.. ముగ్గురు పుడితే రూ.2.25 లక్షలు!

📰 Generate e-Paper Clip

పాత ఎల్లాపూర్ సర్పంచ్ ఏలేటి ప్రశాంత్ రెడ్డి వినూత్న పథకం

భ్రూణహత్యల నివారణే లక్ష్యం.. సొంత నిధులతో ఆడపిల్లల పేరిట డిపాజిట్లు

ఖానాపూర్, అక్టోబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ )

ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించడంతో పాటు భ్రూణహత్యలను అరికట్టాలనే లక్ష్యంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ ఏలేటి ప్రశాంత్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన సొంత నిధులతో ఆడపిల్లల పేరిట డిపాజిట్లు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామంలో ఒక ఆడపిల్ల పుడితే రూ.50 వేలు, ఇద్దరు ఆడపిల్లలు పుడితే రూ.లక్ష, ముగ్గురు ఆడపిల్లలు పుడితే రూ.2.25 లక్షలు వారి పేర్ల మీద డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ఆడపిల్లల పట్ల వివక్షను తొలగించి, వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. సర్పంచిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రశాంత్ రెడ్డి గ్రామ ప్రజలకు ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాఠశాల విద్యార్థులకు ఉచిత వాహన సౌకర్యం, ఉచిత టిఫిన్, అనారోగ్యంతో బాధపడే గ్రామస్తులకు ఉచిత అంబులెన్స్ సేవలు, వైద్య చికిత్సకు సహాయం, నిరుపేదలకు బీమా సదుపాయాలు వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్ల అంటే భారం కాదని, ఆమె ఇంటి మహాలక్ష్మి అని పేర్కొన్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా వారిని ఆదరించాలని, భ్రూణహత్యలను అరికట్టి ఆడబిడ్డలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లల సంక్షేమం కోసం సొంత నిధులతో వినూత్న పథకాన్ని ప్రకటించిన ప్రశాంత్ రెడ్డిని పాత ఎల్లాపూర్ గ్రామస్తులతో పాటు పలువురు అభినందిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, దాతలు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ముందుకొస్తే నిరుపేద కుటుంబాలకు మరింత తోడ్పాటు అందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.