Saturday, October 10, 2026
HomeTelanganaసర్ ప్రక్రియ రద్దు చేయాలి.. సీఈసీపై చర్యలు తీసుకోవాలి

సర్ ప్రక్రియ రద్దు చేయాలి.. సీఈసీపై చర్యలు తీసుకోవాలి

మంచిర్యాలలో ప్రజా సంఘాల నిరసన..

📰 Generate e-Paper Clip

మంచిర్యాల అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )

ఓట్ల ప్రక్షాళన పేరుతో చేపట్టిన సర్ ప్రక్రియను రద్దు చేసి, అందులో జరిగిన తప్పులపై విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మంచిర్యాలలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న యువత ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల ఓటు హక్కుకు నష్టం కలిగిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ చీఫ్ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చొరబాటుదారులను గుర్తించే పేరుతో అసలైన భారతీయుల ఓట్లను తొలగించడం తగదన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ప్రజాధనాన్ని వృథా చేయకుండా ప్రజల ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పౌర స్పందన వేదిక కన్వీనర్ క్యాతం రవికుమార్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ మేధావుల ఫోరం జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ శ్రీరామోజు కొండయ్య, జైభారత్ జిల్లా కన్వీనర్ కాసిపేట రాజేశం, తెలంగాణ జన సమితి నాయకుడు ప్రదీప్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుడు జైపాల్ సింగ్, దేవి పోచయ్య, డూర్కె మోహన్, చిప్పకుర్తి శ్రీనివాస్, కనుకుంట్ల మల్లయ్య, కలవేని సతీష్ కుమార్‌తో పాటు పలు ప్రజా, విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.