సర్ ప్రక్రియ రద్దు చేయాలి.. సీఈసీపై చర్యలు తీసుకోవాలి

మంచిర్యాల అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) ఓట్ల ప్రక్షాళన పేరుతో చేపట్టిన సర్ ప్రక్రియను రద్దు చేసి, అందులో జరిగిన తప్పులపై విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మంచిర్యాలలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న యువత ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల ఓటు హక్కుకు...