Sunday, October 11, 2026
HomeTelanganaమంచిర్యాలనొప్పి నుంచి ఉపశమనం.. మెరుగైన జీవన నాణ్యతే లక్ష్యం

నొప్పి నుంచి ఉపశమనం.. మెరుగైన జీవన నాణ్యతే లక్ష్యం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )

నొప్పి నుంచి ఉపశమనం కల్పించి, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే పాలియేటివ్ కేర్ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ప్రపంచ పాలియేటివ్ కేర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. క్యాన్సర్‌తో పాటు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పాలియేటివ్ కేర్ ద్వారా శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఉపశమనం కల్పిస్తామని తెలిపారు. వ్యాధి చివరి దశలోనే కాకుండా ప్రారంభ దశ నుంచి రోగులకు సమగ్ర సంరక్షణ అందించడం ఈ చికిత్స ప్రత్యేకతని పేర్కొన్నారు. వైద్యులు, నర్సింగ్ అధికారులు, సామాజిక కార్యకర్తలు, మానసిక నిపుణుల సహకారంతో చికిత్సతోపాటు కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు వివరించారు. పాలియేటివ్ కేర్ ఆలన బృందం ద్వారా ఇంటి వద్దకే వెళ్లి వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇంటి వద్ద 600 మందికి వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఫిజియోథెరపీ సిబ్బంది సేవలు అందించగా, పాలియేటివ్ కేర్ ఓపీ, ఐపీ విభాగాల్లో 1,500 మందికి చికిత్స అందించినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాలియేటివ్ కేర్ సేవల వివరాలకు 79898 92078 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కుమారస్వామి, పాలియేటివ్ కేర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ పూర్ణ, డాక్టర్ వీణ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సీహెచ్‌ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, నాందేవ్, నర్సింగ్ అధికారులు, పాలియేటివ్ కేర్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.