నొప్పి నుంచి ఉపశమనం.. మెరుగైన జీవన నాణ్యతే లక్ష్యం

మంచిర్యాల అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) నొప్పి నుంచి ఉపశమనం కల్పించి, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే పాలియేటివ్ కేర్ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ప్రపంచ పాలియేటివ్ కేర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. క్యాన్సర్‌తో పాటు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో...