Saturday, October 10, 2026
HomeTelanganaమంచిర్యాల అడవుల్లో జాతీయ స్థాయి మారథాన్‌!

మంచిర్యాల అడవుల్లో జాతీయ స్థాయి మారథాన్‌!

అక్టోబర్‌ 11న నిర్వహణ.. 7 రాష్ట్రాలు, విదేశాల నుంచి 300 మంది నమోదు.. గాంధారి ఖిల్లా అడవుల్లో ప్రత్యేక ట్రాక్‌లు.. పర్యావరణ పర్యాటకానికి ప్రోత్సాహం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )

పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు మంచిర్యాల ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పట్టణ సమీపంలోని అడవుల్లో అక్టోబర్‌ 11న తొలి జాతీయ స్థాయి మారథాన్‌ నిర్వహించనున్నారు. అటవీ శాఖ, హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌సెక్యూర్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ప్రకృతి ఒడిలో సాగే ఈ మారథాన్‌ ద్వారా మంచిర్యాల అటవీ అందాలను దేశ, విదేశాల వారికి పరిచయం చేయనున్నారు. కొండలు, చారిత్రక గాంధారి ఖిల్లా పరిసరాల్లోని దట్టమైన అడవుల మధ్య ఉన్న సఫారీ ట్రాక్‌పై ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మారథాన్‌ జరగనుంది. ఇందుకోసం మూడు విభిన్న ట్రాక్‌లను సిద్ధం చేసినట్లు జిల్లా అటవీ అధికారి రాహుల్‌ జాదవ్‌ తెలిపారు. పాల్గొనేవారి భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ట్రాక్‌ పొడవునా వైద్య శిబిరాలు, తాగునీరు, ఇతర అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మారథాన్‌కు దేశ, విదేశాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణతోపాటు తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల నుంచి సుమారు 300 మంది ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు, ప్రకృతి ప్రేమికులు పేర్లు నమోదు చేసుకున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. మారథాన్‌లో పాల్గొనే వారికి అల్పాహారంతోపాటు టీ-షర్టు, పతకం, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. అడవి అందాలు, కొండలు, చారిత్రక ప్రదేశాల ప్రత్యేకతను క్రీడా కార్యక్రమంతో అనుసంధానించడం ద్వారా మంచిర్యాల జిల్లాలో పర్యావరణ పర్యాటకానికి మరింత ప్రాచుర్యం లభించనుంది. జాతీయ స్థాయి మారథాన్‌ నిర్వహణతో ఈ ప్రాంతానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.