మంచిర్యాల అడవుల్లో జాతీయ స్థాయి మారథాన్!
మంచిర్యాల అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు మంచిర్యాల ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పట్టణ సమీపంలోని అడవుల్లో అక్టోబర్ 11న తొలి జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించనున్నారు. అటవీ శాఖ, హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌సెక్యూర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ప్రకృతి ఒడిలో సాగే ఈ మారథాన్ ద్వారా మంచిర్యాల అటవీ అందాలను దేశ, విదేశాల వారికి పరిచయం చేయనున్నారు. కొండలు, చారిత్రక గాంధారి ఖిల్లా పరిసరాల్లోని దట్టమైన అడవుల మధ్య ఉన్న...