Saturday, October 10, 2026
HomeTelanganaబీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపిన బీసీ సంఘాల నాయకులు

మంచిర్యాల అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )

కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ.. బీసీల హక్కుల సాధన కోసం అనేక సంవత్సరాలుగా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్ల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీసీలకు సామాజిక న్యాయం కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అలాగే రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, రోస్టర్ విధానాన్ని అమలు చేసి బ్యాక్‌లాగ్ పోస్టులను బీసీలకు వర్తింపజేయాలని పేర్కొన్నారు. బీసీల జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేయాలని, జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను అమలు చేయాలని, బి.పి. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది కర్రె లచ్చన్న, రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మంచర్ల సదానందం, శాఖపురం భీమసేన్, వేముల కిరణ్, గులాము హుస్సేన్, కొట్టే నటేశ్వర్, చలమల అంజయ్య, కీర్తి రవి, ఎం.డి. లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.