Friday, August 14, 2026
HomeTelanganaక్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత పౌష్టికాహార కిట్లు

క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత పౌష్టికాహార కిట్లు

15 మంది టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు.. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని డీఎంహెచ్‌వో పిలుపు

📰 Generate e-Paper Clip

బెల్లంపల్లి, ఆగస్టు 13, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. లయన్స్ క్లబ్ బెల్లంపల్లి సహకారంతో 15 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఉచిత పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్మూలనలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు ఎన్జీవోలు, దాతల సహకారంతో పౌష్టికాహార కిట్లను అందిస్తున్నామని చెప్పారు. సమాజంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించి వారు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునేందుకు సహకరించాలని కోరారు. అనంతరం క్షయ వ్యాధి నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాధి లక్షణాలు, చికిత్స, పౌష్టికాహారం, మందులను క్రమం తప్పకుండా వినియోగించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్ నాయక్, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి, డెమో వెంకటేశ్వర్లు, సీహెచ్‌ఓలు సత్తయ్య, వెంకటేశ్వర్లు, నాందేవ్, హెచ్‌ఈఓ శ్రీనివాస్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ శంకర్, ఇన్‌చార్జి హెపటైటిస్ డీపీసీ మధుబాబు, అకౌంటెంట్ మురళి, ఎన్‌టీఈపీ సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్వైజర్ శ్రీపెల్లి శశికాంత్, ల్యాబ్ టెక్నీషియన్ యాదవ్, లయన్స్ క్లబ్ సభ్యులు కుక్కల నర్సయ్య, మెరుగు ప్రభాకర్, రాజమల్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.