Thursday, August 13, 2026
HomeTelanganaఅవయవ దానం మహాదానం.. మరో ఎనిమిది మందికి పునర్జన్మ

అవయవ దానం మహాదానం.. మరో ఎనిమిది మందికి పునర్జన్మ

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, ఆగస్టు 13, ( ఆంజనేయులు న్యూస్ )

ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో గురువారం ప్రజలకు అవయవ దానంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ చైర్మన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అవయవ దాన ప్రాముఖ్యతను వివరిస్తూ కరపత్రాలు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ “అవయవ దానం మహాదానం” అని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ లేదా నిర్దిష్ట వైద్య పరిస్థితుల్లో మరణించిన వ్యక్తుల అవయవాలను దానం చేయడం ద్వారా గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, క్లోమం, కార్నియాలు వంటి అవయవాలను అవసరమైన వారికి అందించి అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. అవయవ దానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, అవయవ దానం పట్ల అవగాహన పెంచడమే ప్రపంచ అవయవ దాన దినోత్సవం ముఖ్య ఉద్దేశమన్నారు. మనిషి మరణించిన తర్వాత కూడా అవయవ దానం ద్వారా మరికొందరికి జీవం అందించవచ్చని, ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్మన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, సీనియర్ లయన్ సభ్యులు లయన్ ఎం. రామాంజనేయులు, లయన్ ఎస్. నాగేందర్, లయన్ డేగ బాబు, లయన్ ఎడ్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.