Saturday, August 8, 2026
HomeTelanganaగోదావరి పుష్కర ఘాట్‌లో భక్తులకు నీటి కష్టాలు!

గోదావరి పుష్కర ఘాట్‌లో భక్తులకు నీటి కష్టాలు!

📰 Generate e-Paper Clip

స్నానం చేసి ఆలయానికి వెళ్తే.. కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు కరువు

ఒక్క ట్యాప్‌ కూడా పనిచేయక భక్తుల ఆగ్రహం.. పర్యవేక్షకుల సమాధానాలపై అసంతృప్తి

మంచిర్యాల, ఆగస్టు 8, ( ఆంజనేయులు న్యూస్ )

గోదావరి పుష్కర ఘాట్‌కు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిలో పవిత్ర స్నానం ఆచరించిన అనంతరం ఆలయంలో దైవదర్శనం చేసుకునేందుకు వెళ్లే భక్తులకు కాళ్లు కడుక్కునేందుకు ఏర్పాటు చేసిన ట్యాప్‌ల వద్ద నీరు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్‌ వద్ద ఉన్న ఒక్క ట్యాప్‌ కూడా పనిచేయడం లేదని, దీంతో గోదావరిలో స్నానం చేసిన భక్తులు కాళ్లు కడుక్కోకుండానే ఆలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. పవిత్ర గోదావరి స్నానం అనంతరం శుభ్రంగా కాళ్లు కడుక్కొని ఆలయంలోకి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలని వచ్చే భక్తులకు ఈ పరిస్థితి నిరాశ కలిగిస్తోంది. నీటి సమస్యపై ఆలయ పర్యవేక్షకులను ప్రశ్నిస్తే.. సమస్యను పరిష్కరించేలా సమాధానం చెప్పాల్సిందిపోయి బిత్తిరిపోయే సమాధానాలు చెబుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కనీస అవసరమైన నీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్‌కు నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, అలాంటి ప్రాంతంలో తాగునీరు, కాళ్లు కడుక్కునేందుకు నీరు వంటి కనీస సౌకర్యాలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పనిచేయని ట్యాప్‌లను వెంటనే మరమ్మతులు చేయించి, భక్తులకు నిరంతర నీటి సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.