Monday, August 17, 2026
HomeTelanganaమానవత్వం చాటిన హాజీపూర్ ఎస్.ఐ స్వరూప్ రాజ్

మానవత్వం చాటిన హాజీపూర్ ఎస్.ఐ స్వరూప్ రాజ్

📰 Generate e-Paper Clip

మతిస్థిమితం లేని వృద్దురాలికి ఆశ్రయం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మతిస్థిమితం సరిగ్గా లేక ఆనాధగా రోడ్ల వెంట తిరుగుతూ, అత్యంత దుర్భరమైన జీవితం గడుపుతున్న ఓ అనాధ వృద్దురాలిని ఆధారించి. అనంతరం కల్వరి ఆశ్రయంలో చేర్పించి మానవత్వం చాటుకున్న హాజీపూర్ ఎస్.ఐ స్వరూప్ రాజ్.. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ.. హజిపూర్ మండలం గుడిపేట బేటాలియం సమీపంలోని పెట్రోల్ పంపు ఏరియాలో మతిస్థిమితం సరిగ్గా లేని ఓ వృద్దురాలు నడి రోడ్డు పై వచ్చిపోయే వాహనాలకు ఎదురుగా వెళుతూ ఇబ్బంది పెడుతున్న విషయాన్ని శుక్రవారం స్థానికులు గమనించి హాజపూర్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు.. వెంటనే స్పందించి తమ సిబ్బంది అయినా కానిస్టేబుల్ జి. సత్యనారాయణ, సాయి నాథ్ లను సంఘటన స్థలానికి పంపించి మతిస్థిమితం సరిగ్గా లేని వృద్దురాలిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని..అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని “కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ వృద్ధుల మరియు మానసిక వికలాంగుల ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. కల్వరి కుమార్ కు చరవాణి ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వరి కుమార్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.. అనంతరం వృద్దురాలిని కల్వరి కుమార్ కు అప్పగించామని ఎస్.ఐ తెలిపారు. స్థానికులు ఫోన్ చేసిన వెంటనే స్పందించి వృద్ధురాలికి ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్న ఎస్.ఐ స్వరూప్ రాజ్ ను మరియు పోలీస్ సిబ్బందిని పలువురు అభినంధించి కృతజ్ఞతలు తెలియజేశారు.. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కల్వరి కుమార్ మాట్లాడుతూ.. మతిస్థిమితం సరిగ్గా లేనివారు మీకు ఎక్కడైనా కనబడుతే నాకు 9701973636 సమాచారం అందించినట్లు అయితే వారికీ మేము సేవ చేయడానికి సిద్ధం గా ఉన్నాం అని తెలిపారు.. ఈ కార్యక్రమం లో హెడ్ కానిస్టేబుల్ శేఖర్, కానిస్టేబుల్స్ జి. సత్యనారాయణ, సాయి నాథ్, క్రాంతికుమార్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.