
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు.. జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి.చంద్రయ్య, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య లతో కలిసి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు.. ఈ గర్వకారణమైన ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని “శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్ మరియు గురువు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత, నాట్య విభూషణి, అన్నం కల్పన ఎం.ఎ, కూచిపూడి” గురువుల కోసం ప్రత్యేకంగా గేయాన్ని రాసి ఆ గేయాన్ని కూచిపూడి నృత్య ప్రదర్శనతో తన శిష్య బృందం అయినా వాక్యాన్ పటేల్, లాహిత్య, వినుజ, సాధిక, సమీక్ష, అలోకి, తనుజ, లతో గురుభక్తిని కూచిపూడినాట్యం ద్వారా ప్రదర్శించి గురువులను మంత్రముగ్ధులను చేశారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఇటువంటి కూచిపూడి నృత్య ప్రదర్శనలు నేటి సమాజంలో ఎంతో అవసరం అని, ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనకు శిక్షణ ఇచ్చే గురువుకు మరియు నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను, ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులను అభినందించారు..

ఈ నాట్య ప్రదర్శన ప్రతిభకు గాను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ పి చంద్రయ్య జిల్లా విద్యాధికారి యాదయ్య నాట్య గురువు కల్పన కు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.. అనంతరం నాట్య గురువు కల్పన మాట్లాడుతూ.. సంప్రదాయ సంగీతం, రాగాలు, నాట్యాభినయంతో కూడిన ఈ ప్రదర్శన, మన గురువుల గొప్పతనాన్ని తెలియజేసే కళాత్మక ఆవిష్కరణగా నిలుస్తుందని, కూచిపూడి రూపంలో గురువుల కోసం ఈ ప్రదర్శన చేయడం ఇది ఒక అద్భుతమైన అనుభూతినిస్తుందని ఈ గేయాన్ని గురువులందరికి అంకితం చేస్తున్నానని తెలియజేశారు.
