Monday, August 17, 2026
HomeTelanganaర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు

ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు

📰 Generate e-Paper Clip

ఉపసంచాలకులు, జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ అధికారి సిహెచ్. దుర్గాప్రసాద్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులముల కళాశాల బాలుర వసతి గృహములో ఉంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకొని దుర్గం శంకర్ అనే కళాశాల బాలుర వసతి గృహ విద్యార్థి సీపీ గేట్ రాష్ట్రస్థాయి పరీక్షలో 21వ ర్యాంకు ను భౌతిక శాస్త్ర విభాగంలో సాధించి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో అడ్మిషన్ పొందారు.. అదేవిధంగా ఆకుదారి రామ్ భూపాల్ విద్యార్థి బిపిఈడి విభాగంలో కాకతీయ యూనివర్సిటీలో మంచి ర్యాంకును సాధించి అడ్మిషన్ పొందారు.. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉపసంచాలకులు, జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ అధికారి దుర్గాప్రసాద్ గురువారం స్థానిక వసతి గృహంలో అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించి ఆశీస్సులు తెలియజేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. కృషితో నాస్తి దుర్భిక్షం.. విద్యార్థులందరూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధన కొరకు నిరంతరం శ్రమిస్తే విజయం అనేది కష్టం కాదని భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఎదగడానికి ఎంతో సహకరిస్తుందని, సరైన విద్యను పొందటం ద్వారానే సమాజంలో పేదరికం అనేది లేకుండా చేయొచ్చని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు..

వసతిగృహ సంక్షేమ అధికారి సిహెచ్ కుమారస్వామి మాట్లాడుతూ.. వసతి గృహంలో ఉన్న ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశం చేసుకొని ఆ లక్ష సాధన కొరకు నిరంతరం శ్రమించాలని వీళ్ళ మాదిరిగానే ప్రతి విద్యార్థి మంచి ర్యాంకులు సాధిస్తూ ఉన్నత స్థానాల్లో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నానని తెలిపారు.. సన్మాన గ్రహీతలు ఆకు దారి రాంభూపాల్, దుర్గం శంకర్ ఉపసంచాలకులకి, వసతి గృహ సంక్షేమ అధికారికి మరియు మాకు ఈ అవకాశాలు ఇచ్చిన షెడ్యూల్ కులం అభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్ కి వసతి గృహానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.