Monday, August 17, 2026
HomeCrimeమెడికల్ కాలేజీ విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన

మెడికల్ కాలేజీ విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన

📰 Generate e-Paper Clip

షీ టీం డెకాయ్ ఆపరేషన్‌తో కామాంధుడి అరెస్ట్!

మంచిర్యాల షీ టీం ఎస్ఐ హైమ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మెడికల్ కాలేజీ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక చికెన్ సెంటర్ ఉద్యోగిని మంచిర్యాల షీ టీమ్ చాకచక్యంగా పట్టుకుంది. రహస్య సమాచారం అందుకున్న షీ టీమ్, పక్కా ప్రణాళికతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి, నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే: మంచిర్యాల జిల్లా కాలేజీ రోడ్డులో ఉన్న ఒక చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్న వ్యక్తి, మెడికల్ కాలేజీ విద్యార్థినులు కాలేజీకి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు తన ప్యాంట్ విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని షీ టీమ్‌కు సమాచారం అందింది. వారి తల్లిదండ్రుల నుండి అందిన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన మంచిర్యాల షీ టీం ఎస్సై హైమ తన షిటీం బృందంతో షీ టీమ్ డెకాయ్ ఆపరేషన్: పక్కా ప్రణాళికతో పట్టివేత అందిన సమాచారం ఆధారంగా షీ టీమ్ తక్షణమే రంగంలోకి దిగింది. నిందితుడిని పట్టుకునేందుకు ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా షీ టీమ్ సభ్యులు సాదా దుస్తులలో ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. షి టీమ్ ఎస్.ఐ. వి.హైమ తో కానిస్టేబుల్ సతీష్, మహిళా కానిస్టేబుల్స్ జ్యోతి, శ్రీలత ఈ డెకాయ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అనుమానితుడి కదలికలను నిశితంగా పరిశీలించిన తర్వాత, అతను విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని గుర్తించారు. సరైన సమయం చూసి, షీ టీమ్ అతన్ని అదుపులోకి తీసుకుంది.
అరెస్ట్, కేసు నమోదు, భద్రతకు భరోసా
నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా, అతను తన నేరాన్ని అంగీకరించాడు. అతనిపై తక్షణమే కేసు నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ ఘటనతో విద్యార్థినులలో నెలకొన్న భయం తొలగిపోయి, భద్రతపై వారికి మరింత భరోసా లభించింది.
మహిళలు, యువతులు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా షీ టీమ్ నిరంతరం నిఘా పెడుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఏదైనా వేధింపులకు గురైనట్లయితే వెంటనే షీ టీమ్ లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని వారు కోరారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.