Monday, August 17, 2026
HomeTelanganaఆసరా పెన్షన్ లో అక్రమాలు.?

ఆసరా పెన్షన్ లో అక్రమాలు.?

📰 Generate e-Paper Clip

వారు వృద్ధులని కూడా చూడరు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని కాసిపేట, నేన్నెలా, ఆవడం, మరియు పలు గ్రామీణ ప్రాంతాలలో ఆసరాగా నిలిచే పింఛను డబ్బుల్లో రూ. 16 నొక్కేస్తున్నారు. కనీసం వారు వృద్ధులు అని కూడా చూడడం లేదు. కొందరేమే చిల్లర లేవంటారు.. మరికొందరేమో వచ్చే నెల ఇస్తామంటారు.. పేరేదైనా తపాలా శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న పింఛన్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే ఈ రోజు పంపిణీ చేయమని లబ్ధిదారులను బెదిరిస్తున్నారు.

• జిల్లాలో పింఛన్ల పంపిణీ తీరు:

జిల్లాలో ఆసరా పింఛన్ల పంపిణీలో తపాలా శాఖ సిబ్బంది రూ.16 కోత విధిస్తున్నారు. వీటికి ఎక్కడా లెక్కలు లేవు. ఖాతా పుస్తకాల్లో 2016 ఇచ్చినట్లు నమోదు చేస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మళ్లీ పింఛన్ తీసుకునేందుకు వచ్చిన సమయంలో గంటల తరబడి నిరీక్షించేలా చేస్తున్నారు. సిగ్నల్ సమస్య ఉందని మళ్లీ రావాలని సూచిస్తున్నారు. జిల్లాలోని ఆవడం, జెండావెంకటాపూర్, ప్రాంతాల్లోని ఆరు గ్రామ పంచాయతీల్లో 900 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ఇలా నెలకు కనీసం రూ.14,500 కోత విధించి సిబ్బంది జేబులు నింపుకొంటున్నారు. ఇలా మండలంలో 2500 పింఛన్లలో 80 శాతం మందికి కోత విధిస్తున్నారు.

ప్రతి నెల రూ. 2000 మాత్రమే ఇస్తున్నారు..

-మాలోతు ముత్తమ్మ, గుడిపేట

ప్రతి నెల రూ. 2000 మాత్రమే ఇస్తున్నారు. అడిగితే ఇంతే ఇక రావని చెబుతున్నారు. పాసు పుస్తకంలో రూ. 2016 ఇచ్చినట్లు రాస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశా

– గుమ్మాల ఆశన్న ఆవడం

చిల్లర లేవంటున్నారు. అడిగితే పదహారు రూపాయలే కదా అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర కోత విధిస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శికి సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందన లేదు.

ప్రశ్నిస్తే ఇవ్వకుండా వెళ్లారు

-గోగు రాజమల్లు, జెండావెంకటాపూర్

తపాలా సిబ్బందిని ప్రశ్నిస్తే రెండు, మూడు రోజుల వరకు పింఛన్ ఇచ్చేది లేదని వెళ్లిపోవాలని చెప్పారు. మాకు సమయం ఉన్నప్పుడు చెల్లిస్తామని చెప్పారు. ఆరు నెలల నుంచి ఒక్కరికి కూడా రూ.16 ఇవ్వడం లేదు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.