Tuesday, August 18, 2026
HomeCrimeమూఢనమ్మకాలు నాటువైద్యాన్ని నమ్మొద్దు

మూఢనమ్మకాలు నాటువైద్యాన్ని నమ్మొద్దు

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: వైద్యుల సలహాలు సూచనల మేరికే మందులు వాడాలని, మూఢ నమ్మకాలను నాటువైద్యాన్ని ఆచరించొద్దని అదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పట్నాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు.. యువతకు, గంజాయి సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.
మారుమూల ఆదివాసి గ్రామాలలో ఉంటున్న ప్రజలకు వైద్య సేవలను అందించాలని సద్దుదేశంతో జిల్లా పోలీసు యంత్రాంగం తరపున  పట్నాపూర్ గ్రామం నందు బుధవారం జిల్లా వైద్యశాఖ మరియు నిర్మల్ స్వప్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటగా జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాలు నడుము స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ, వైద్య బృందం తో రిబ్బన్ కట్ చేసే ప్రారంభించారు. ముఖ్యంగా ఈ వైద్య శిబిరం నందు జనరల్ మెడిసిన్, యూరాలజీ, గైనకాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్ లలో నిష్ణాతులైన వైద్య బృందం చే చికిత్స నిర్మల్ స్వప్న మల్టీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో వైద్య చికిత్సలను అందజేయడం జరిగింది.

ఈ వైద్య శిబిరం లో పట్నాపూర్, ఇన్కర్పల్లి, సుర్దాపూర్ మేడిగుడ్ గ్రామల నుండి దాదాపు 250 మంది ఆదివాసి ప్రజలు వైద్య శిబిరం నందు పాల్గొని వైద్య చికిత్సలను పొందారు. ఆదివాసీలు గంజాయి కి దూరంగా ఉండాలని, గంజాయిని పండించడం వాడటం వ్యాపారం చేయడం వల్ల సమాజం నష్టపోతుందని అదేవిధంగా దానికి బానిస ఆయన కుటుంబాలు రోడ్డున పడతాయని తెలియజేశారు. ముఖ్యంగా యువత రోడ్డు ప్రమాదాలు జరగకుండా సరైన వయస్సు వచ్చిన తర్వాతనే లైసెన్స్ తీసుకొని వాహనాలను నడపాలని మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు కారణమై ప్రాణనష్టం సంభవిస్తుందని తెలిపారు. వాహనం నడిపే సమయంలో రోడ్డు నియమాలను సక్రమంగా పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు. యువత సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలని, ప్రస్తుత సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న నూతన పద్ధతులపై ప్రజలకు యువతకు వివరించారు. సైబర్ క్రైమ్ ప్రస్తుతం ఆన్లైన్ నందు జరుగుతున్న మోసాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, స్టాక్ మార్కెట్ ఫ్రెండ్, సోషల్ మీడియా ఫ్రాడ్ ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా డయల్ 100 ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ హండ్రెడ్ సంప్రదించాలని జిల్లా పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలాలకు చేరుకొని సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. త్వరలోనే జిల్లా పోలీసు యంత్రాంగం తరపున జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కేటాయించిన ప్రదేశాలలో విధులను నిర్వర్తించాలని సూచించారు. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని సరైన వయస్సు వచ్చిన తర్వాత వారికి త్వరలోనే లైసెన్స్ మేళాను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అర్హత ఉన్న వారు ప్రభుత్వ విధివిధానాల ప్రకారం లైసెన్సులను పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి,  సీఐ ఏ వెంకటేశ్వర్ రావు, ఎస్సై ఎల్ ప్రవీణ్, వైద్యాధికారి  రవీంద్ర ప్రసాద్, ఏ జి పి పంద్రం శంకర్, పలువురు డాక్టర్లు  పీహెచ్సీ వైద్య సిబ్బంది,  పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.