Tuesday, August 18, 2026
HomeCrimeపాకిస్తాన్ నుంచి తిరుపతి వ్యక్తికి బెదిరింపు కాల్

పాకిస్తాన్ నుంచి తిరుపతి వ్యక్తికి బెదిరింపు కాల్

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, తిరుపతి: పాకిస్థాన్ కు చెందిన అధికారి పేరిట తిరుపతికి చెందిన వ్యక్తికి ఓ ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్ కుమార్ స్థానికంగా గాజుల వ్యాపారం చేస్తుంటారు. బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై తిరుమలకు వెళ్తుండగా 92 32925 27504 నంబరు నుంచి ఫోన్ వచ్చింది. కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ‘మీరు ఏం చేస్తున్నారో.. మాకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం’ అని హెచ్చరించారు. దీనిపై త్రిలోక్ కుమార్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సీఐ రామ్ కిషోర్ స్పందిస్తూ.. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోందని, దర్యాప్తు అనంతరం పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.