Tuesday, August 18, 2026
HomeWorldవక్షోజాలు మళ్లీ బిగుతుగా మారాలంటే..!

వక్షోజాలు మళ్లీ బిగుతుగా మారాలంటే..!

📰 Generate e-Paper Clip

నాకు ఇద్దరు పిల్లలు. పాపకు పాలిచ్చినన్ని రోజులు నా వక్షోజాలు మంచి ఆకృతిలో, బిగుతుగా ఉండేవి. కానీ పాలు మానేసిన తర్వాత వదులైపోయాయి. అలాగే నేను బరువు కూడా బాగా తగ్గిపోయాను. పాప పుట్టినప్పుడు 53 కిలోలుండేదాన్ని.. ఇప్పుడు 40 కిలోలున్నాను. బరువు తగ్గడానికి, వక్షోజాల పరిమాణం తగ్గడానికి ఏమైనా సంబంధముందా? అవి తిరిగి బిగుతుగా మారి, మంచి ఆకృతి రావాలంటే ఏం చేయాలి? ఓ సోదరి

జ: మీరు చెప్పే విషయం సర్వసాధారణంగా జరిగేదే! ఎందుకంటే పాలిచ్చేటప్పుడు పాల గ్రంథుల పరిమాణం పెరుగుతుంది. పాలతో నిండి ఉన్నప్పుడు వక్షోజాలు పెద్దగా, బిగుతుగా ఉంటాయి. పాలివ్వడం ఆపేసిన తర్వాత పాల గ్రంథుల పరిమాణం తగ్గుతుంది.. దానికి తోడు మీరు 13 కిలోలు తగ్గేటప్పటికి వక్షోజాల్లో ఉండే 50 శాతం కొవ్వు పదార్థం కూడా తగ్గిపోయి ఒకేసారి మీకు వక్షోజాలు వదులైపోయినట్లు, చిన్నవైపోయినట్లుగా అనిపిస్తోంది. అయితే మీరు చేయగలిగింది. ఆరోగ్యకరమైన రీతిలో తిరిగి బరువు పెరగడం. తద్వారా రొమ్ముల్లో కొవ్వు పెరిగి వక్షోజాల పరిమాణం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోది – వక్షోజాల కింద ఉండే కండరాలు (Pectoral Muscles) దృఢం కావడానికి వ్యాయామాలు చేయడం. ఏదేమైనా పిల్లలు పుట్టాక వక్షోజాల ఆకృతిలో మార్పు రావడం సాధారణమైన విషయం కాబట్టి దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.