Tuesday, August 18, 2026
HomeTelanganaకాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, నారాయణపేట జిల్లా: జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. పోలీసుల బందోబస్తుతో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐదుగురు సభ్యుల అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. జిల్లా నోడల్ అధికారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. సంపత్ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య మహాలక్ష్మిని అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఈక్రమంలో ఆమె స్పృహ కోల్పోయింది. సమాచారం అందుకొని హుటాహుటిన ఇంటికి చేరుకున్న సంపత్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా దాడులు చేయడమేంటని నిలదీశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.