Tuesday, August 18, 2026
HomeTelanganaమన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయం

మన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

 

శశికిరణ్ మంచిర్యాల ప్రతినిధి:

10,000 రూ. చెక్ ను అందజేస్తున్న మన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని కన్నెపల్లి మండల కన్నెపల్లి గ్రామ నివాసి అయిన గొర్లపల్లి కిష్టయ్య తనయుడు యోగేశ్వర్ గురుకులంలో చదువుకొని ఇంటర్ లో 912 మార్కులు సాధించి అలాగే నీట్‌ 2023 జరిగినటువంటి పరీక్షలో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. ఇతనికి రామగుండం లోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజిలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఇతని కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదవడానికి ఆర్థికస్తోమత లేకపోవడంతో ఎవరైనా దాతల నుండి సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇట్టి విషయం తెలుసుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్(ఆక్ట్) వెనుకబడిన పేద ప్రజల పిల్లల చదువును ప్రోత్సహించాలనే సదుద్దేశంతో యోగేశ్వర్ కి 10,000/- రూపాయలు చెక్ రూపంలో ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. పేదలకు, అనాధలకు ,ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మరియు చదువుకునే వాళ్ళను ప్రోత్సహించడంలో మా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తున్నాము.ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షుడు ఎస్.మహేందర్, ఉపాధ్యక్షుడు కె. తిరుపతి , ప్రచార కార్యదర్శి బి.భూమేష్ అసిస్టెంట్ సెక్రటరీ జె.శ్రీనివాస్, సభ్యులు కె.సంపత్ మరియు అశోక్ కుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.