Wednesday, August 19, 2026
HomeCrimeహైస్కూల్ ను సీజ్ చేయాలి

హైస్కూల్ ను సీజ్ చేయాలి

📰 Generate e-Paper Clip

బిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.గుణ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని మందమర్రి మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న లత హైస్కూల్ లో అనుమతి లేకున్నా నవోదయ కోచింగ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఒక్కొక్కరికీ లక్షల ఫీజు వసూలు చేస్తున్నారని, అనుమతి లేకున్నా ఒకే కాంపౌండ్ లో బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారని, అలాగే విద్యార్థుల స్కూల్ టైంలోనే ఫస్ట్ ఫ్లోర్ లో మున్సిపాలిటీ నుండి అనుమతి లేకున్నా అక్రమ  నిర్మాణాలు చేపడుతున్నారని దీని వల్ల పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని ప్రిన్సిపాల్ మేడం గారిని అడిగితే అవన్నీ మీకెందుకు అని పిల్లల తల్లిదండ్రులతో కఠినంగా సమాధానం చెపుతున్నారని, కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడమే కాదు పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఎటువంటి అనుమతి లేకున్నా హాస్టల్స్ నిర్వహిస్తూ, నవోదయ కోచింగ్ అంటు లక్షల ఫీజు తీసుకుంటున్న లత హైస్కూల్ ను సీజ్ చేసి, స్కూల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి కి మంచిర్యాల జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఎం.వి.గుణ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద, ఆసంపల్లి రమ, లక్ష్మి, సిద్దు, కుమార్ పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.