Tuesday, August 18, 2026
HomeTelanganaమైనార్టీ గురుకులాలో ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ

మైనార్టీ గురుకులాలో ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ

📰 Generate e-Paper Clip

జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పని చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సబ్జెక్టులు టి.జి.టి.పి.జి.టి./ జె.ఎల్./ పి.ఈ.టి. స్టాఫ్ భర్తీ చేయనున్నందున మహిళ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల విషయ పరిజ్ఞానము, బోధన నైపుణ్యము, అనుభవము, ఆంగ్ల భాష పరిజ్ఞానము, డెమో ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేసి భవిష్యత్తులో ఏర్పడే ఖాళీల యందు పొరుగు సేవల విధానంలో అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సరైన ధృవపత్రాలతో జిల్లాలోని మంచిర్యాల (బాలికలు), బెల్లంపల్లి (బాలికలు), చెన్నూర్ (బాలురు) గురుకులాలలో, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ శాఖ అధికారి కార్యాలయంలో ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గం॥ లోగా సమర్పించాలని, విద్యార్హతలు, ఇతర వివరాల కొరకు మైనార్టీ పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ను సంప్రదించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.