Tuesday, August 18, 2026
HomeTelanganaహామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల  బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలోని సాయికుంటలో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా దళితుల ఇండ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. దళిత కుటుంబాలకు దళిత బంధు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, స్వంత భూమి ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రజినిష్ జైన్, పట్టి వెంకట కృష్ణ, కమెర శారద, గోదారి స్వప్న, కమేర అర్జున్, కుచాడి సతీష్, అమిరిషెట్టీ రాజు, రెడ్డిమళ్ళ అశోక్, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.