Tuesday, August 18, 2026
HomeTelanganaఓవర్ బ్రిడ్జి వద్ద గల రామ ధర్మకాంటను తక్షణమే తొలగించాలి

ఓవర్ బ్రిడ్జి వద్ద గల రామ ధర్మకాంటను తక్షణమే తొలగించాలి

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి చున్నాం బట్టి దగ్గర గల రామ ధర్మకాంటను తక్షణమే అక్కడి నుండి తొలగించాలని బుధవారం ట్రాఫిక్ సి.ఐ నరేశ్ కుమార్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఓవర్ బ్రిడ్జి వద్ద ధర్మకాంట ఉండడం వలన ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. అదే విధంగా ట్రాఫిక్ కి అంతరాయం జరుగుతుంది అని ధర్మకాంట వలన యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది అని అన్నారు. ఇట్టి ధర్మకాంటను తక్షణమే అక్కడి నుండి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ చైర్మైన్ చిప్పకుర్తి శ్రీనివాస్, విద్యార్థి జేఏసీ కన్వీనర్ జుమ్మిడి గోపాల్, కో కన్వీనర్ రేగుంట క్రాంతి కుమార్, కో కన్వీనర్ పురేళ్ల నీతిష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.