Tuesday, August 18, 2026
HomeTelanganaఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 7లక్షల రూపాయలు అందించాలి.

ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 7లక్షల రూపాయలు అందించాలి.

📰 Generate e-Paper Clip

బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లక్షట్టి పెట్ మండలం పాత కొమ్ముగూడెం గ్రామంలో బుధవారం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గడప గడపకు బిజెపి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ గడప గడపకు బిజెపి కార్యక్రమంలో బాగంగా మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది అదే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించడం జరుగుతుంది అని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి పేదలకు స్వంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి అవాస యోజన కింద దేశ వ్యాప్తంగా స్వంత ఇల్లు నిర్మాణం చేస్తూనే మన రాష్ట్రంలో ఆ పథకం అమలు చేయకుండ పేద ప్రజలకు స్వంత ఇండ్లు నిర్మించకుండ పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేయడంలో, స్వంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సహాయం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ ఇవ్వకుండ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారనీ అన్నారు. మండలంలో గూడెం లిఫ్ట్ మరియు కడెం కాలువ ద్వారా సాగు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనీ అన్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు వైఫల్యం తోనే గూడెం లిఫ్ట్ పైపులు మార్చడం లేదని అన్నారు. వెంటనే గూడెం లిఫ్ట్ పైపులు మార్చి తక్షణమే మొదలు పెట్టి రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండా ప్రభాకర్,  బొప్పు సతీష్, హేమంత్ రెడ్డి, తోట సతీష్, బీయ్యల లచ్చన్న, బొక్కేనపల్లి సతీష్, గాదాసు చుకున్న, నిల్గొండ గురువన్న, శ్రీరామ్, దొంతుల వినోద్, ప్రశాంత్, శశిధర్, సంతోష్, రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.