Tuesday, August 18, 2026
HomeDelhiనేను నీ పని మనిషిని కాను.. ఉద్యోగిని: ఎయిర్ హోస్టెస్ ఆగ్రహం

నేను నీ పని మనిషిని కాను.. ఉద్యోగిని: ఎయిర్ హోస్టెస్ ఆగ్రహం

📰 Generate e-Paper Clip

ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ప్రయాణికుడికి, ఎయిర్ హోస్టెస్ కు మధ్య ఆహారం విషయంలో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఆంజనేయులు న్యూస్, ఇస్తాంబుల్-దిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ప్రయాణికుడికి, ఎయిర్ హోస్టెస్ కు మధ్య ఆహారం విషయంలో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇస్తాంబుల్-దిల్లీ విమానంలో ఈ నెల 16న జరిగిన ఈ ఘటనను చిత్రీకరించిన ఓ ప్రయాణికుడు బుధవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో ఉన్న దృశ్యాల ప్రకారం.. ఎయిర్ హోస్టెస్ వ్యక్తితో మాట్లాడుతూ.. “మీవల్ల మా ఉద్యోగి ఏడుస్తున్నారు. మీ బోర్డింగ్ పాస్ లో ఏం ఉందో దాని ప్రకారమే మేము ఆహారాన్ని అందిస్తాం” అని చెప్పింది. దీనిపై అతడు తీవ్రంగా స్పందిస్తూ.. “నువ్వు ప్రయాణికుడికి సేవకురాలివి” అని వ్యాఖ్యానించారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “నేను ఉద్యోగిని.. నీకు పనిమనిషిని కాను” అని గట్టిగా అరిచింది. దీంతో “ఎందుకు అరుస్తున్నావు? నోర్మూసుకో..” అని ప్రయాణికుడు హెచ్చరించగా, “నువ్వూ నోర్మూసుకో” అని ఎయిర్ హోస్టెస్ బదులిచ్చింది. ఆమె సహోద్యోగి వారిద్దరిని వారించడంతో గొడవ సద్దుమణిగింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.