Tuesday, August 18, 2026
HomeTelanganaఅదనపు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అధికారులు

అదనపు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అధికారులు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా బాధ్యతలు స్వీకరించిన బి. రాహుల్ ను శుక్రవారం రోజున ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో జిల్లా శాఖల అధికారులు కలిసి రావాలని, సమిష్టిగా పని చేద్దామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ శాఖ ఎ.డి. బాలు, ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు పురుషోత్తం, క్రీడా, యువజన శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పౌరసంబంధాల అధికారి వై.సంపత్ కుమార్, ఉపాధి కల్పన శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రవీందర్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి జి.సత్యం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.