Monday, August 17, 2026
HomeTelanganaరాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భి. మధు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని సీఐటీయు కార్యాలయంలో బుధవారం రోజున సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియూ 6వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ 6వ రాష్ట్ర మహాసభలు శ్రీరాంపూర్ పట్టణ కేంద్రంలో నవంబర్ 26-27 తేదిలలో జరుగనున్నాయి. ఈ సందర్బంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భి. మధు. మాట్లాడుతూ. ఈ రోజు దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి నేటి వరకు దేశంలోని ప్రభుత్వ రంగా సంస్థలను అతి తక్కువకు భడా కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడి దారులకు అమ్ముతున్నారు. అంతే కాకుండా కార్మికుల హక్కులను కాలేరాసే విదంగా ఉన్న రక్షణ కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 కొత్త కార్మిక చట్టాలను అమలులోకి తీసుకొస్తున్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని, అదే విదంగా తెలంగాణలో కొత్తగా బొగ్గు బావులు తీయాలని, స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలని, అదే విదంగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించాలని సమరశిలా పోరాటాలు నిర్వహిస్తుంది. వేతనాల పెంపు కోసం, సిఎం పీఫ్ చిట్టీల కోసం, బోనస్ పెరుగుదల కోసం సమానం పనికి సమాన వేతనం కోసం. కార్మికుల మరణాలకు ఎక్స్ గ్రేషియా కోసం, కార్మికుల రక్షణ కై, అన్ని రకాల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా సింగరేణిలో వస్తున్నా పరిణామాలు, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, సింగరేణి పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న విధానాలపై ఈ మహాసభలో చర్చించి, రాబోయే కాలంలో పోరాటాలను రూపాకల్పన చేయడానికి ఈ మహాసభలు జరుగనున్నాయి.

కావున ఈ మహాసభల విజయవంతం కొరకు జిల్లాలోని అన్ని రకాల కార్మికులు, ప్రజలు, మేధావులు, ప్రముఖులు, అందరు ఆర్థిక, హార్థిక, సహాయ, సహకారాలు అందించగలరని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం బెల్లంపల్లి రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు దూలం శ్రీనివాస్, కుమారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.