Wednesday, August 19, 2026
HomeTelanganaహైదరాబాద్ లో దారుణం.?

హైదరాబాద్ లో దారుణం.?

📰 Generate e-Paper Clip

బాలుడి మర్మాంగాలపై టపాసులు కాల్చిన యువకులు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని గండిమైసమ్మ గుడి ప్రాంతంలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడిని పట్టుకుని మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ.. వీడియో తీస్తున్న దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ ఖుషీనగర్కు చెందిన 16 ఏళ్ల బాలుడిని.. ఓ రెడీమిక్స్ కర్మాగారంలో పనిచేసేందుకు వారి బంధువులు 3 నెలల క్రితం పంపించారు. కొన్నిరోజుల నుంచి ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న అక్కడి కొందరు యువకులు.. అత్యంత దారుణానికి ఒడిగట్టారు. బాలుడిని కదలకుండా గట్టిగా పట్టుకొని టపాసులు పేలుస్తూ వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. వైరల్ వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు.. ఘటనపై యూపీలోని కుషీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.