పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారుల పాత్ర కీలకమైనది.
రామగుండం సిపి. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి
ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమీషనరేట్: కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల లోని పోలీస్ స్టేషన్ ల రిసెప్షన్ అధికారులతో మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ. పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారి యొక్క పాత్ర కీలకమైనదని, ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం విశ్వాసం కల్పించడంలో రిసెప్షన్ అధికారి ముఖ్య పాత్ర వహిస్తారని తెలిపారు. రిసెప్షన్ అధికారి బాధితులతో మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని తెలిపారు. వ్రాత పూర్వక ఫిర్యాదు విషయంలో ఫిర్యాదును సూక్ష్మంగా చదివి పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం సిసిటీఎన్ఎస్ లో ఫిర్యాదు లోని విషయాలను నమోదు చేయాలని తెలిపారు. ప్రతి పిటిషన్ ను దాని స్టేటస్ బట్టి 7 రోజుల లోపు అప్లోడ్ చేయాలి. ఫిర్యాదుల తీవ్రతను బట్టి వెంటనే స్పందించి తన పై అధికారులకు గాని లేదా ఇతర వర్టికల్ అధికారులకు గాని తెలియజేసి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫిర్యాదుదారులను ఎస్ హెచ్ వో లేదా ఇంచార్జి అధికారులతో కలిపించి ఆ వివరములను మరియు తీసుకున్న చర్యల వివరాలను సిసిటీఎన్ఎస్ పిటిషన్ మేనేజ్మెంట్ అప్లికేషన్ లో నమోదు చేయాలని తెలిపారు. పెండింగ్ యాక్టివిటీస్ రిపోర్ట్, అప్లికేషన్ స్టాస్టిక్ రిపోర్ట్ & పిటిషన్ మేనేజింగ్ సిస్టమ్‌లో పిటిషన్ పత్రాలను అప్‌లోడ్ చేయడం మరియు సిటిజన్ ఫీడ్ బ్యాక్ & 5S కాన్సెప్ట్ సిస్టమ్ అమలు గురించి వివరించారు. రిసెప్షన్ వద్ద మరియు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండునట్లు తాను నిర్వహించే సిస్టం, రికార్డ్స్ నీ క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశంలో ఉన్నట్లు చూసుకుని సులభంగా అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి అని సిబ్బందికి తెలిపారు.
అక్టోబర్ నెల లో రిసెప్షన్ వర్టికల్స్ లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను సిపి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్., స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్, సిసి ఆర్బి ఇన్స్పెక్టర్ రాజకుమార్, రిసెప్షన్ వర్టికల్ ఇంచార్జ్ పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఐటి కోర్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాము, రహీం, రిసెప్షన్ వర్టికల్ సిబ్బంది పాల్గొన్నారు.
