Tuesday, August 18, 2026
HomeTelanganaతెరాస ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. నిందితులకు నోటీసులు

తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. నిందితులకు నోటీసులు

📰 Generate e-Paper Clip

తెరాస ఎమ్మెల్యేకు ఎర కేసులో నిందితులకు పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోపు విచారణకు హాజరుకావాలని నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్లకు మొయినాబాద్ పోలీసులు సూచించారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ‘తెరాస ఎమ్మెల్యేకు ఎర కేసులో నిందితులకు పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోపు విచారణకు హాజరుకావాలని నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ కు మొయినాబాద్ పోలీసులు సూచించారు. గురువారం రాత్రే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సరైన ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గురువారం నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) వర్తించదని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ను గురువారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు 41 సీఆర్పీసీ కింద నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు. భాజపాలో చేరాలంటూ తెరాసకు చెందిన తాండూరు, అచ్చంపేట, కొల్లాపూర్, పినపాక ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను ప్రలోభపెట్టారని ముగ్గురు నిందితులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

నిందితులు (కూర్చున్న వారు) సింహయాజి, రామచంద్రభారతి, నందకుమార్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.