
ఆంజనేయులు న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో రేషన్ మాఫియా రూట్ మార్చిందా అంటే మార్చిందే అని చెప్పాలి. చిన్న చిన్న వాహనాల్లో అయితే ఈజీగా దొరికేస్తామని ఏకంగా రేషన్ మాఫియా రైళ్లలోనే అక్రమ రవాణాకు తెగిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర సరిహద్దులు లేదా జిల్లా సరిహద్దుల్లో గోదాముల్లో నిల్వ చేసి రాత్రికి రాత్రే రాష్ట్రాలు దాటిస్తున్నారా అంటే అవుననే స్పష్టం అవుతోంది. సిర్పూర్ టి రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అందించే పీడీఎస్ బియ్యాన్ని కొందరు దళారులు అక్రమమార్గం ద్వారా మహారాష్ట్రకు రైళ్లలో తరలించి ధనార్జన ధ్యేయంగా దందాకు తెరలేపారు. కొమురం భీం జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్ను తమ దందాకు అడ్డాగా మార్చుకున్నారు. అది చిన్నరైల్వే స్టేషన్ కాబట్టి ఎక్కువగా అధికారులు తనిఖీలు ఉండవని భావించి దళారులు ఈ రైల్వే స్టేషన్ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణాకు హాట్ స్పాట్ గా ఎంచుకోని రాష్ట్రం దాటిస్తున్నారు.
