Wednesday, August 19, 2026
HomeTelanganaపోలీసులకు వ్యాసరచన పోటీల నిర్వహణ పూర్తి

పోలీసులకు వ్యాసరచన పోటీల నిర్వహణ పూర్తి

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీసులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ నుండి ఎఎస్ఐ స్థాయి వరకు పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయవలసిన కృషి అనే అంశంపై, ఎస్సై పై స్థాయి అధికారులకు సమర్థవంతమైన పోలీసులు మహిళా పోలీసుల పాత్ర అనే అంశంపై రెండు కేటగిరిలో ఈ పోటీలు నిర్వహించబడ్డాయని తెలిపారు. ఈ పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల నందు ఐదువందల పదాలకు మించకుండా ఉండేలా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో 50 మందికి పైగా పోలీసులు పాల్గొని వ్యాసరచన పోటీలను విజయవంతం చేశారు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి జిల్లా స్థాయి నందు అవార్డులు అందజేసి, ఈ ముగ్గురు రాసిన వ్యాసాన్ని రాష్ట్రస్థాయి కి పంపి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ హెడ్ క్వార్టర్ ఇంచార్జ్ ఆర్ఎస్ఐ డి వెంకటి, ఏ ఆర్ ఎస్ ఐ సంతోష్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.